Monday, December 23, 2024

మహిళా శక్తి చాటండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వ్యాపార రంగంలో మహిళలు మరింత ముందుకు రావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్ర ప్రభు త్వం పెద్దఎత్తున ప్రొత్సాహం కల్పిస్తోందన్నారు. ఈ రంగంలో నూ మహిళలు తమదైన ముద్ర వేయాలన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఒ(ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్) అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాపారంలో రాణిస్తున్న పలువురు మహిళలకు ఆయన అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినప్పటి నుంచి అన్ని రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలన్న లక్షంతో రా ష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసే లక్ష్యంతో వి…హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహాక సంస్థ అయిన వి….హబ్ ఒక్క తెలంగాణాలోనే ఉందన్నారు. మహిళలచేత నడపబడుతున్న అంకుర సంస్థలకు సమగ్ర వేదికగా, ప్రోత్సాహక సంస్థగా నిలవడంతో పాటు హైదరాబాద్ నగరాన్ని మహిళా పారిశ్రామికతకు గమ్యస్థానంగా మలచడం వి…హబ్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. దీనివల్ల ప్రస్తుతం మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు అంకుర సంస్థలను స్థాపించేలా, విస్తరించేలా, కార్యకలాపాలు వేగవంతం చేసేలా వి…హబ్‌లు ఎంతోగానే తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. కాగా మహిళా సంస్థ ప్రతినిధులు తరుచూ రాష్ట్రాన్ని సందర్శించాలని కెటిఆర్ కోరారు. కేవలం రావడమే కాకుండా మరిన్ని ప్రాజెక్టులు, నిధులు తీసుకుని రావాలన్నారు. కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని కెటిఆర్ వివరించారు. దీని కోసం ఆయన అహర్నిశలు శ్రమించారన్నారు.

అందుకే కేంద్ర ప్రభుత్వం సాయం లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సొంతంగా ఎదుగలిగిందన్నారు. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అనేక సఁక్షేమ పథకాలను సైతం అమలు చేసి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఫలితంగా దేశ జిడిపిలో 5 శాతం వాటా తెలంగాణదే అని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి గర్వకారణమన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. దీని ద్వారా దేశ, విదేశాలకు చెందిన అనేక కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయన్నారు. 2౦14లో ఐటి ఎగుమతులు కేవలం 57000 కోట్లు కాగా ఇప్పుడు అది 1,83,000 కోట్లుకు చేరిందన్నారు కెటిఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ మాజీ సిఇఒ అమితాబ్ కాంత్, ఐటి ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జయంతి దాల్మియా, పింకీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News