Thursday, December 26, 2024

లైంగికంగా వేధించిన ర్యాపిడో రైడర్… బైక్ పైనుంచి దూకిన యువతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధించడంతో ఓ యువతి బైక్‌పై నుంచి దూకిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత శుక్రవారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి బైక్ బుక్ చేసుకుంది. యువతిని ర్యాపిడో రైడర్ బుక్ చేసుకున్న తరువాత ఒటిపి వస్తుందని ఫోన్‌ను లాక్కోవడంతో అప్పటికే ఆమెకు భయం వేసింది. యువతి వెళ్లే ప్రదేశానికి కాకుండా మరో ప్రదేశానికి రైడర్ వెళ్తుండడంతో ఆపాలని అడిగింది. అతడు బైక్ వేగం పెంచడంతో మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించింది.

Also Read: 15 రోజుల్లో పెళ్లి…. రోడ్డు ప్రమాదంలో కాబోయే వరుడు, వధువు మృతి

యువతి ఆందోళనలో బైక్ పైనుంచి కిందకు దూకడంతో చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజీ సెక్యూరిటీ దగ్గరికి వెళ్లింది. సెక్యూరిటీ నుంచి చూసి ర్యాపిడో రైడర్ అక్కడి నుంచి పారిపోయాడు. తన స్నేహితురాలికి సమాచారం ఇవ్వడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు రైడర్ ఎపికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తులో అతడు ఈ చర్యలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News