Thursday, January 23, 2025

మద్యం మత్తులో తల్లిదండ్రులు.. బాలుడు కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మద్యం మత్తులో తల్లిదండ్రులు ఉండగా వారి కుమారుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన జూలై 4వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తరప్రదేశ్‌కు చెందిన పింకీ దేవి, అజయ్ అనే ఇద్దరు దంపతులు పటాన్‌చెరువులోని ఇస్నాపూర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల

4వ తేదీన పిల్లలను తీసుకుని సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడ పిల్లలను ఉంచి ఇద్దరు కలిసి మద్యం షాపుకు వెళ్లి తాగి వచ్చారు. దంపతులు మద్యంతాగి ఉన్నట్లు గుర్తించిన మహిళ వారిపై దృష్టిసారించింది. వారి నలుగురి పిల్లల్లో చిన్నవాడైన ఏడు నెలల బాలుడిని కిడ్నాప్ చేసింది. మద్యం మత్తు నుంచి తేరుకున్న దంపతులు తమ బాలుడు లేని విషయం గమనించారు. దీంతో ఆందోళనకు గురైన రైల్వే స్టేషన్ మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ చెన్నైకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News