- Advertisement -
హైదరాబాద్: మాల్కాజ్ గిరిలో గుడిలో వెళ్లి అనుమానస్పదంగా మృతిచెందిన ఉమాదేవి కేసులో పోలీసులు ఆలయ పూజారిని అదుపులోకి తీసుకున్నారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంలో పూజారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనే ఉమాదేవిని హత్యచేసినట్టు అనుమానిస్తున్నారు. నగల కోసమే ఆమెను చంపినట్టు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఒంటిపై నగలతో ఉమాదేవి గుడికి వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుడికి సమీపంలోనే ఆమె మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -