Monday, December 23, 2024

ట్రాక్టర్ బోల్తా.. మహిళ కూలీలకు గాయాలు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: తిర్యాణి మండలంలోని గుండాల గ్రామం వద్ద ట్రాక్టర్ వాహనం శనివారం ఉదయం బోల్తా పడి మహిళ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తిర్యాణి ఎస్‌ఐ సిహెచ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం తిర్యాణి మండలం గుండాల గ్రామానికి చెందిన సుమారు 23 మంది మహిళ కూలీలు పత్తి తీయుటకు రోంపల్లి గ్రామం వైపు ట్రాక్టర్ వాహనంలో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి  బోల్తా పడినట్లు తెలిపారు. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలకు గాయలయినట్లు తెలిపారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా తిర్యాణి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గాయాలైన వారిలో మర్సుకోల దృపతిబాయి, శంకరమ్మ, రాధాబాయి, కమలాబాయి, భీంబాయి, పార్వతిబాయిలు ఉన్నారు.

వీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితులను ఎస్‌ఐ అడిగి తెలుసుకున్నారు. వీరికి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ చోదకుడు సోల్లు గణేష్‌ పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామంలో ఎక్కువగా పేదలు నివసిస్తూ ఉండడంతో కూలీలు పనుల కోసం ఇలా వెళ్తు ఉంటారని, గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాల లేకనే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించాయని, ఇకనైన ప్రభుత్వ ఆధికారులు, పాలకులు స్పందించి సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News