Tuesday, January 21, 2025

రైలు వెళ్ళే వరకు పట్టాల మధ్యనే పడుకున్న మహిళ

- Advertisement -
- Advertisement -

రైలు పట్టాలు దాటుకొని ఇంటికి వెళ్ళాలనుకున్న ఓ మహిళ.. అకస్మాత్తుగా రైలు రావడంతో చాకచక్యంగా వ్యవహరించి పట్టాల మధ్యలో పడుకొని తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, బషీరాబాద్ మండలం, నవాండ్గి రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం, టాకీ తండాకు చెందిన ఓ మహిళ సొంత పనుల నిమిత్తం బషీరాబాద్ వెళ్ళింది. పనులు ముగించుకొని తన తండాకు తిరిగి వెళ్ళేందుకు రైలు పట్టాలు దాటుతుండగా ఎదురుగా ఒక్కసారిగా గూడ్స్ రైలు వచ్చింది.

దీనిని గమనించిన ఆమె ఎటూ కదలకుండా రైలు వెళ్ళే వరకు స్థానికుల సూచనలు పాటిస్తూ పట్టాల మధ్యనే పడుకుంది. రైలు పట్టాల మీదనే వెళ్లినప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో ఆమె హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. రైలు ప్రమాదం నుండి చాకచక్యంగా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకొన్న మహిళ ధైర్యాన్ని చూపరులు మెచ్చుకున్నారు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News