Monday, December 23, 2024

రైతు బిడ్డను పెండ్లి చేసుకునే యువతికి రూ. 2 లక్షలు: కుమారస్వామి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఓట్ల వేటలో నేతలు హామీలు గుప్పిస్తున్నారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందజేస్తుందని జేడీ(ఎస్)నేత , మాజీ సిఎం హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. కోలార్ లోని పంచరత్నలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కుమారస్వామి మాట్లాడుతూ రైతుల పిల్లల పెళ్లిళ్లను ప్రోత్సహించడానికి వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు ప్రభుత్వం రూ. 2 లక్షల నగదు అందించాలని కోరారు.

రైతుల కుమారులను పెళ్లి చేసుకోడానికి యువతులు సుముఖంగా లేరని తన దృష్టికి వచ్చిందని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేస్తే మన యువకుల ఆత్మగౌరవాన్ని కాపాడవచ్చని చెప్పారు. కర్ణాటకలో 224 స్థానాలకు జెడీ(ఎస్) 123 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఇప్పటివరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News