Saturday, November 23, 2024

మహిళల ఉన్నత విద్యకు ఓకే.. కో ఎడ్యుకేషన్‌కు నో

- Advertisement -
- Advertisement -

Women may study in no-men classrooms:Taliban

 

కాబూల్: మహిళల ఉన్నత విద్యకు అనుమతిస్తామని.. అయితే, ఇస్లామిక్ డ్రెస్‌కోడ్ పాటించాల్సిందేనని తాలిబన్లు తెలిపారు. బాలురు, బాలికలకు వేర్వేరు తరగతి గదుల్లో బోధన ఉంటుందని తాలిబన్లు పునరుద్ఘాటించారు. తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నతవిద్యామంత్రిగా వ్యవహరిస్తున్న అబ్దుల్‌బఖీ హక్కానీ దీనిపై వివరణ ఇచ్చారు. యూనివర్సిటీల్లో పిజి కోర్సులకు కూడా మహిళలకు అనుమతి ఇస్తామని, కో ఎడ్యుకేషన్‌కు మాత్రం అనుమతించమని హక్కానీ తెలిపారు. 20 ఏళ్ల క్రితం తాలిబన్లు అధికారంలో ఉన్నపుడు బాలికల విద్యకు అనుమతించకపోవడం గమనార్హం. ఇప్పుడు అనుమతి ఇచ్చినా డ్రెస్‌కోడ్(బుర్కా, వగైరా) పాటించడంతోపాటు బాలురతో కలువకుండా వేర్వేరుగా పాఠాలు వినాలి. ఏయే సబ్జెక్టులు బోధించాలనేదానిపైనా సమీక్ష నిర్వహించనున్నట్టు హక్కానీ తెలిపారు. గత ప్రభుత్వంలో సంగీతంపై తాలిబన్లు నిషేధం విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News