Saturday, December 21, 2024

విజయవాడలో మహిళపై నలుగురు అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

అమరావతి: కూలీ పనులు చేసేకునే మహిళను నమ్మించి ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద సులభ్ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఓ మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు మాయమాటలు చెప్పి డిసెంబర్ 17న సనత్‌నగర్‌లోని ఓ రూమ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ మరో ముగ్గురితో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెపై మూడు రోజులు అఘాయిత్యానికి పాల్పడడంతో బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News