బెంగళూరు: గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి మహిళను హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్ర బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అఫ్రినా ఖానం(28), లాలూఖాన్(30)లతో కలిసి యారబ్నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఇంట్లోనే టైలరింగ్ చేస్తుండగా అతడు టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానం ఉండడంతో పలుమార్లు వారి ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. భర్త పనికి వెళ్లిన అనంతరం ఓ వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవ పెట్టుకున్నాడు. కత్తెర తీసుకొని ఆమె కడుపులో పొడవడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతదేహంపై బట్టలు కప్పి నిప్పంటించి ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు ఆమె భర్తకు, సోదరుడికి సమాచారం ఇచ్చారు. ఇంటి డోర్ పగలగొట్టి చూడగా ఆమె మృతదేహం బెడ్‌పై సగం కాలిపోయింది. డిసిపి హరీశ్ పాండే తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లోకి చొరబడి మహిళను కత్తెరతో పొడిచి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -