Tuesday, January 21, 2025

హైకోర్టులో హైడ్రా

- Advertisement -
- Advertisement -

నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చి జీవో 99ను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మీ అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ వాదించారు. జిహెచ్‌ఎంసి యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అధికారికి ఇవ్వకూడదని తెలిపారు.

జిహెచ్‌ఎంసికి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జివో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News