Thursday, January 9, 2025

బ్యాంకు దోపిడీని అడ్డుకున్న మహిళా పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన ముగ్గురు దొంగల ఆటకట్టించారు ఇద్దరు మహిళా పోలీసులు. బీహార్‌లోని వైశాల జిల్లా సెంధూవరి బ్లాక్‌లోగల గ్రామీణ బ్యాంకులో భద్రతా విధులను మహిళా పోలీసులు జుహి కుమారి, శౠంతి కుమారి నిర్వహిస్తున్నారు. బుధవారం రెండు బైకుల్లో వచ్చిన ముగ్గురు దొంగలు బ్యాంకుల్లోకి చొరబడి ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ చేతుల్లోని తుపాకులు లాక్కున్నారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించసాగారు.

అయితే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ దొంగలపై దాడి చేసి వారి చేతుల్లోని తమ తుపాకులను స్వాధీనం చేసుకోవడమేగాక వారిని చితక్కొట్టారు. ఇంతలో పెద్దసంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకోవడంతో దొంగలు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ దృశాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. బ్యాంకు దోపిడీని అడ్డుకున్న ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ధైర్యసాహసాలు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. వారి పేర్లను రివార్డు కోసం సిషార్సు చేయనున్నట్లు తెలిపారు. సిటి టివి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News