Sunday, December 22, 2024

త్రాగు నీటి కోసం కాలి బిందెలతో మహిళల నిరసన

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట ః జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో 5రోజుతుగా నీళ్లు రావడంలేదని గురువారం ఇల్లందకుంట క్రాస్ రోడ్డు వద్ద యూత్ కాంగ్రేస్ ఆధ్వర్యంలో మహిళలు కాలి బిందెలతో నిరసన తెలిపారు. మహిళలు రోడ్డుకు అడ్డంగా కాళీ బిందెలతో నిరసన తెలుపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో గత ఐదు రోజులుగా త్రాగు నీరు రావడం లేదని, తమను పట్టించుకునే వారే లేరని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘంటన స్థలానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పి ఇళ్లకు పంపించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రేస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సజ్జద్ మొహమ్మద్, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్‌రెడ్డి, 5వ వార్డుకు చెందిన మహిళలు బోగ లలిత, రమ, రాజేశ్వరి, రబ్బాన, సుందరమ్మ, స్వరూప, షబానా, కళ్యాణి, రాణి, తార, బబ్బి, సల్మాన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News