Sunday, December 22, 2024

ప్రేమ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ నేత..

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తనను ప్రేమ వివాహం చేసుకుని మోసం చేశారని, న్యాయం చేస్తానని చెప్పిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని మాజీ మంత్రి జూపల్లి కార్యాలయం ముందు సోమవారం మేడ్చేల్ గ్రామానికి చెందిన మౌనిక అనే మహిళ చంటి బిడ్డతో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేత రాజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అంజి తనను ప్రేమ పెండ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి బాబు పుట్టిన తర్వాత మోసం చేశాడని ఆరోపించింది.

తనను, తన బిడ్డను పట్టించుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, వరకట్న వేధింపులు చేస్తున్నారని ఆరోపించింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు కావడంతో మాజీ మంత్రి జూపల్లి తనకు న్యాయం చేస్తానని చెప్పి చేయలేదని ఆరోపించింది. ఇదిలా ఉండగా రాజకీయంగా తనను ఎదుర్కొలేకే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు తన భార్యతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బాధిత మహిళ భర్త గోపాల అంజి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News