Wednesday, January 22, 2025

సింగరేణిలో మహిళా కారుణ్య నియామకాలు గణనీయంగా పెరుగుదల

- Advertisement -
- Advertisement -

 ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
 భూ గర్భగనుల్లో సర్దుబాటు చేసేయోచనలో యాజమాన్యం
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం మహిళా కార్మికులకు భూగర్భ, ఉపరితల గనుల్లో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటోంది. కారుణ్య నియమాకాల్లో భాగంగా సంస్థలో మహిళా ఉద్యోగల సంఖ్య అధికంగా పె రగడంతో ఇందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత కొద్దికాలంగా వీరికి ఉపరితలంలోని విభాగాలకు, గనులపై విధులు నిర్వర్తించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక ఉపరితలంలో వీరిని సర్దుబాటు చేసే పరిస్థితులు కనిపించక పోవడం తో పత్యామ్యాయ మార్గాలను అన్వేషిస్తోంది.

మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తు కేంద్ర ప్రభు త్వం 2019 జనవరి 29న జారీ చేసిన గెజిట్‌కు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు వీరిని గనుల్లో దింపే అవకాశం లేకున్నా భవిష్యత్తు అవసరాల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇం తకుముందు మహిళలకు ఇచ్చే కారుణ్య నియమాక పత్రంలో ఉపరితలం బదిలీ వర్కర్ అని ఉంటుంది. ఇకపై ఉపరితం అనే పదాన్ని తొలగించి బదిలీ వర్కర్ అని వ్యవహరించనుంది. లిం గ విక్షను నిర్మూలించడానికి ప్రభుత్వం చేసిన చట్ట సరవణ వల్ల బొగ్గు గనులు, చమురు క్షేత్రా లు, మైకా బంగారం, ఇనుప ఖనిజం లభించే గనుల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి.

సింగరేణిలో వందల సంఖ్యలో మహిళలకు కారుణ్య నియమాకాల వల్ల వందల సం ఖ్యలో మహిళలకు కారుణ్య నియమాకల వల్ల ఉద్యోగాలు లభించాయి.1952 ముందు బొగ్గు గనుల్లో మహిళలు, బాలులు పనిచేసేవారు వీరిని గనుల్లో దింపకూడదని చట్ట సవరణ చేయడంతో 70 ఏళ్ళుగా మహిళలు భూగర్బ గనుల్లో పనిచేయడం లేదు. కోల్ ఇండియాలో ఒక మహిళ మై నింగ్ ఇంజనీరింగ్‌గా విధులు నిర్వరిస్తున్నారు. అక్కడి ఉపరితల బొగ్గు గనుల్లో షవల్ ఆపరేట ర్లు, ఈపి ఆపరేటర్లుగా మహిళలు పనిచేస్తూ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళ ల్ని గనుల్లో పనిచేయడానికి అనుమతించిన కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖల గనుల యాజమాన్యాలకు కొన్ని షరుతులు విధించింది. పనితీరు ఆధారిత పదోత్నతులు, నిధులు కేటాయిం పు ఉండాలని లింగ తటస్థత పాటించాలని స్పష్టం చేసింది.

భూగర్భ గనులతో పాటు గనుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల లోపు విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగుల కోసం సరైన వాష్ రూంలు, చిన్న పిల్లలను జాగ్రత్తగా చేసేందుకు క్రచ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విశ్రాంతి గదులు, మారుమూల ప్రాంతాల్లో వారికి తగిన భద్రత కల్పించేందుకు మహిళా రక్షకులను నియమించాలి. మహిళా ఉద్యోగుల కోస మే ప్రత్యేకంగా ఇంటి నుంచి పని ప్రదేశాలకు తీసుకెళ్ళే వాహనాలు, మహిళా రక్షక దళం పర్యవేక్షణలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.అయితే భూగర్బ గనుల్లో పనిచేసందుకు మహిళలు తమ సమ్మతి తెలుపుతూ రాతపూర్వకంగా అనుమతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. రక్షణ, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నం కా కుండా చర్యలు తీసుకోవాలి. మహిళా ఉద్యోగు ల్లో కనీసం ముగ్గురితో కూడిన జట్టుగా ఉండేలా పనిచేసే విధంగా నియమించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News