Wednesday, January 22, 2025

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గూడూరు : సిఎం కెసిఆర్ అన్నివర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఎంఎల్‌ఎ బానోతు శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి తొమ్మిది సంవత్సరాల్లో జరిగిందని, అభివృద్ధి చూడలేని ప్రతిపక్షాలు లేనిపోని నిందలు వేస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని, రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించాలన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కెసిఆర్‌కు దక్కిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందన్నారు. 86 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపిపి సుజాత మోతీలాల్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి.ఖాసీం, వైస్ ఎంపిపి ఆరె వీరన్న, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వెంకటకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, బోడ కిషన్, రహీం, వెంకన్న, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News