- Advertisement -
ముంబయి: ఒంటిమీద దుస్తులు లేకపోతే మహిళలు బాగుంటారని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా నోరుజారారు. మహారాష్ట్రలోని థానేలో మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, పలువురు మహిళలు, రామ్‌దేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌దేవా బాబా ప్రసంగించారు. యోగా చేసిన అనంతరం మహిళలు యోగా దుస్తులు మార్చుకునేందుకు సమయ దొరకకపోవడంతో చీరలు ధరించలేదన్నారు. మహిళలు చీరల్లో, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారని మెచ్చుకున్నారు. మహిళలు దుస్తులు ధరించకపోతే ఇంకా బాగు ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నవారు అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియాలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
- Advertisement -