Friday, December 20, 2024

మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

కీసర: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు నెలల ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. మొదటి విడతలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.

ఈ సందర్భగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్ధిక స్వేచ్చ కలిగి ఉండాలని అందుకోసం స్వయం ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడంతోపాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి న్యాక్ ఆధ్వర్యంలో మిషన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, న్యాక్ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News