Wednesday, January 22, 2025

మహిళలకు కూడా అంతే గౌరవం దక్కాలి

- Advertisement -
- Advertisement -

సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఎవరూ తక్కువ, ఎక్కువ కాదు”అని అం టోంది బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్. ఆమె రాజకుటుంబంలో జన్మించినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది. “చిన్నప్పుడు మా అమ్మానాన్నలకు రంగోలి, అక్షత్‌లనే ఇద్దరు తోబుట్టువులు జన్మించారు. వారికంటే ముందు ఓ బాబు పుట్టి చనిపోయాడు. దీంతో మా తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఆతర్వాత నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడపిల్లే పుట్టిందని నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు.

అప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది. మహిళ ఎప్పుడూ మ గవారి సంతోషమే తన సంతోషంగా భావిస్తుంటుంది. కానీ సమాజంలో మహిళలకు సరైన గౌరవం లేదు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో మగాడికి ఎం త గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం దక్కాలి”అని పేర్కొంది. ఇక కంగనారనౌత్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఎంపిగా గెలుపొందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News