- కర్ణాటక ఎమ్మెల్యే డాక్టర్ భరత్ శెట్టి
కల్వకుర్తి: పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం మహిళా మోర్చా సమావేశాన్ని పట్టణ పార్టీ అధ్యక్షుడు బోడ నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే భరత్ శెట్టి, మాజీ జాతీయ బిసి కమిషన్ సభ్యులు ఆచారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యే భరత్ శెట్టి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, రాజకీయాల్లో రాణించాలని, దేశ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. మహిళలు చట్టసభల్లో నిలబడి తమ హక్కుల కోసం పోరాడాలని భారతీయ జనతా పార్టీ మహిళలకు సముచిత స్థానం ఇస్తుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రపతిని మహిళగా నిలబెట్టిందని అన్నారు. ఆచారి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో మహిళా శక్తి ఏకమై భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పార్వతి, మహిళా నాయకురాలు జయ్యమ్మ, ఎన్నం సువర్ణ, బోడ పావని, నర్మద, గీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని మాడుగుల మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయంలో భజన బృందాన్ని కలిసి శ్రీరామ నామస్మరణ అర్పించారు. ఆయన వెంట బిజెపి నాయకులు పాల్గొన్నారు.