Friday, December 20, 2024

మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలి

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చామ సంపూర్ణవిజయశేఖర్‌రెడ్డి సూచించారు. కుంట్లూరు 19వ వార్డులో గీతాచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమీషన్ల శిక్షణ నిర్వహించి సర్టిఫికేట్లను వైస్ చైర్‌పర్సన్‌తో అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడు తూ కుట్టుమిషన్ శిక్షణ పొంది పూర్తి చేసిన మహిళలు స్వయం ఉపాధితో జీవితంలో స్థిరపడ్డాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పి రాధిక, ట్రైనర్ ఎస్ రేణుక మరియు బి.రాజేశ్వరి, జి.భాగ్య, జి.నాగమణి, జి.జ్యోతి, ఎస్. రాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News