Tuesday, December 24, 2024

చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ ఆద్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్,సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

వ్యవసాయంతో పాటు అనుబందంగా చేపల పెంపకం చేపట్టి మహిళలు లక్షాధికారులు కావాలని తెలిపారు. ఇతర మహిళలకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. సాంకేతక అంశాలు, మార్కెటింగ్ మెళుకువలు నేర్చుకుని ఆర్థికంగా పటిష్టం కావాలని సూచించారు. మహిళల సందేహాలకు అధికారులు సమాధానాలు తెలిపారు. సమావేశంలో డి ఆర్ డి ఓ సాయన్న, అడిషనల్ డిఆర్డిఓ మురళీకృష్ణ, డిపిఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News