Monday, December 23, 2024

మహిళలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : విద్యార్థినులు, మహిళలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలని దానివల్ల ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవచ్చని ఎస్‌పి అఖిల్ మహజన్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఆపరేషన్ జ్వాల పేరిట నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలోని 113 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లో శిక్షణ కార్యక్రమాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థినులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు.అనుభవజ్ఞులైన శిక్షకులచే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఆకతాయిల బారినుండి కాపాడుకోవడానికే కాకుండా చైన్ స్నాచింగ్, లైం గిక దాడుల సమయంలో సెల్ఫ్‌డిఫెన్స్ టెక్నిక్స్ ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థినులు, మహిళలు స్వీయ రక్షణ విధా నాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో పోలీసులు నిరంతరం మహిళల రక్షణ కోసం పనిచేస్తున్నాయన్నారు. షీ టీమ్‌లు సివిల్ దుస్తుల్లో సంచరిస్తూ ఆకతాయిల బారినుండి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పిస్తున్నాయన్నారు.విద్యార్థినులు వేధింపులకు గురైతే షీ టీమ్‌కు గాని, డయల్ 100కు గాని సమాచారం అందించాలన్నారు. మహిళలపై వేధింపులను అరికట్టే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News