Wednesday, January 22, 2025

తెలంగాణ కాంగ్రెస్‌కు మహిళలే బుద్ది చెప్పాలి: రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పాసవ్వాలని దేశమంతా ఆశగా ఎదురుచూస్తోంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం ఓటింగ్ లో పాల్గొనకుండా పారిపోవడం.. యావత్ మహిళా లోకాన్ని అవమానించడమే అవుతుందని రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. మహిళా బిల్లు పాసవ్వాలని దేశంలోని మహిళలంతా ఆశించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ముగ్గురు ఓటింగ్ సమయం వరకు ఉండి ఓటింగ్ టైంలోనే సభ నుంచి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు. బిల్లును బహిష్కరించారు కాబట్టే సరిగ్గా ఓటింగ్ టైంలో వెళ్లిపోయారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.దీన్ని బట్టి మహిళలకు, మహిళా సాధికారతకు తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమని దీని ద్వారా స్పష్టమైందన్నారు.

ఈ ముగ్గురు ఎంపీలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకమని.. అందుకే ఓటింగ్ ను బహిష్కరించారని ఆయన ఆరోపించారు.చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తున్న టైంలో ముగ్గురు ఎంపీలకు అంతకుమించిన ముఖ్యమైన పని ఏముంటుందని ప్రశ్నించారు.పార్టీ కార్యక్రమాలకు, సభలకు, సమావేశాలకు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికి రేవంత్ రెడ్డికి దొరికిన సమయం.. మహిళా బిల్లుకు ఓటేసేందుకు దొరకలేదాంటూ నిలదీశారు.అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి మహిళా బిల్లుపై ఎగతాళిగానే మాట్లాడారన్నారు. బిల్లుకోసం బీఆర్‌ఎస్ ఎంపీలు ఆమరణ దీక్ష చేసి చనిపోతే సంఘీభావం తెలుపుతామన్న కాంగ్రెస్ ఎంపీలు బిల్లు పార్లమెంట్ లో ఓటింగ్ కు వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు.

సీనియర్ నేతలమని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే అంత చులకన ఎందుకున్నారు. ఇదేనా వీళ్లు మహిళలకు ఇచ్చే గౌరవం.? ఇన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ కేవలం తెలంగాణకు మాత్రమే ద్రోహం చేస్తోంది అనుకున్నాం. కానీ వాళ్లు మహిళా ద్రోహులు, మహిళా సాధికారతకు వ్యతిరేకులు అని తేటతెల్లమైందన్నారు. రేవంత్ రెడ్డి గానీ, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వచ్చినప్పుడు రాష్ట్రంలోని మహిళలు వీరికి చెప్పులు, చీపుర్లతో సన్మానం చేసి పంపాలని సూచించారు.. అప్పుడు కానీ తెలంగాణ కాంగ్రెస్‌కు, ఆ పార్టీ ఎంపీలకు బుద్ది రాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News