Friday, December 20, 2024

యాత్రలు చేసే మహిళలు తమ అనుభవాలను అక్షరీకరించాలి: ఆది నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  యాత్రలు చేసే మహిళలు తప్పక తమ అనుభవాలను అక్షరీకరించాలని రచయిత ఆది నారాయణ మాచవరపు సూచించారు. ఆదివారం పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 45 మంది తెలుగు మహిళల యాత్రా కథనాలతో అన్వీక్షికి పబ్లికేషన్స్ వెలువరించిన ఇంతియానం పుస్తకావిష్కరణ చేశారు. ఈసందర్భంగా ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన స్వర్ణ కిలారిని అభినందించారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది రచయితలు, రచయిత్రులు, సామాజిక ఉద్యమకారులు, సాహిత్య అభిమానుల మధ్య ఈ ఆవిష్కరణ సభ ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. ప్రయాణాలు చేసినప్పుడు మహిళల దృష్టికోణం వేరుగా ఉంటుందని, తెలుగులో యాత్రా సాహిత్యమే తక్కువ అని, అందులో స్త్రీల యాత్ర కథనాలు మరింత తక్కువని అందుకే తెలుగు సాహిత్యానికి ఈ ఇంతియానం పుస్తకం ఒక చక్కని చేర్పు అని వక్తలందరూ అభిప్రాయపడ్డారు.

పుస్తక సంపాదకురాలు స్వర్ణ కిలారి మాట్లాడుతూ కొన్ని నెలల క్రిత్యం శివ్యానాథ్ రాసిన ద షూటింగ్ స్టార్ అనే పుస్తకం చదివనని 23 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇళ్లు అమ్మేసి సంచార జీవితం గడుపుతూ ప్రపంచాన్ని చుట్టేస్తున్న శివ్యానాథ్ అనుభవాలు చదివాక తెలుగులో యాత్రా కథనాలు రాసిన మహిళల అనుభవాలన్నీ ఒక సంకలనంగా తేవాలనే అలోచన వచ్చినట్టు తెలిపారు. ఈ సంకలనానికి అడగగానే తమ రచనలు అందించిన రచయిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు పింగళి చైతన్య, సూరేపల్లి సుజాత ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News