Tuesday, February 4, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐతో మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగింది.  చిల్వాకోడూరు వద్ద ముందున్న రెండు బైకులు ఢీకొన్నాయి. కారు రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో ఎస్ఐ శ్వేతతో పాటు ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. శ్వేత ధర్మారం నుంచి జగిత్యాలకు వెళ్తుండగా ముందున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి, వాటిని తప్పించబోయి ఆమె కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. దీంతో మహిళా ఎస్ఐ ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌ డిపార్ట్ మెంట్ లో డిసిఆర్‌బి ఎస్ఐగా శ్వేత సేవలందిస్తున్నారు. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్‌, పెగడపల్లిలో ఎస్‌ఐగా పని చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News