Wednesday, January 22, 2025

వివాహేతర సంబంధం… భర్తను చంపించిన మహిళా ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ఓ మహిళా ఎస్‌ఐ తన భర్తను చంపించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కిరాయి రౌడీలు, ప్రియుడితో పాటు సదరు ఎస్‌ఐని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెంథిల్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతడి భార్య చిత్ర(44) సింగారపేట పోలీస్ స్టేషన్‌లో స్సెషల్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోంది.

తన కుమారుడు సెంథిల్ కనిపించడంలేదని సెప్టెంబర్ 16న ఆయన తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 14న జగదీష్ కుమార్, కమల్ రాజ్ అనే వ్యక్తులు తామే హత్య చేశామని క్రిష్ణగిరి కోర్టు ముందు లొంగిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటపడ్డాయి. కారు డ్రైవర్ కమల్ రాజ్‌తో చిత్ర వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవడానికి కమల్ రాజ్ తో చిత్ర ప్లాన్ వేసింది. భర్తను కిరాయి రౌడీలతో హత్య చేయించినట్టు ఒప్పుకుంది. ఈ కేసులో నిందితులు చిత్ర, మంత్రగత్తే సరోజ(32), రౌడీలు విజయ్ కుమార్(21), రాజపాండ్యన్(21), జగదీష్ కుమార్, కమల్ రాజ్ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News