Sunday, December 22, 2024

బ్యూటీపార్లర్ కు వెళ్లి ఉన్న అందం పోగొట్టుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్యూటీపార్లర్ కు వెళ్లి ఓ మహిళ ఉన్న అందం పోగొట్టుకున్న ఘటన నగరంలోని అబిడ్స్ లో చోటుచేసుకుంది. పాతబస్తీకి చెందిన ఓ మహిళ తన భర్త కోరిక మేరకు బ్యూటీపార్లర్ కు వెళ్లింది. తన భార్యను మోడల్ గా చూడాలనుకున్న భర్త కోరిక తీర్చేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లిన మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టారు.

ఆ తర్వాత మహిళ జుట్టు ఊడిపోవడం ప్రారంభమై.. భార్యభర్తల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో పార్లర్ లో పెట్టిన హెయిర్ ఆయిల్ తో తన జుట్టు ఊడిపోయిందని బాధితురాలు బ్యూటీపార్లర్ పై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News