రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూతరుతో కలిసి మహిళా ఆత్మహత్యాయత్నం
మన తెలంగాణ/కుల్కచర్ల: తన భర్త చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం డబ్బుల్ని ఇవ్వకుండా తహసీల్దార్ మూడేళ్లుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు న్యాయం జరగదని కూతురితో పాటు తహసీల్ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకొ ని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన రాముల మ్మ అనే మహిళ భర్త 2007లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నా డు. దీంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం కోసం ఆర్జి పెట్టుకోగా 2019లో రూ. 5లక్షలు సాయం కింద మంజూరయ్యాయి.
అయితే ఈ డబ్బులు చెక్ రూపంలో రాములమ్మ, కుల్కచర్ల తహసీల్దార్ పేరిట జాయింట్ ఖాతాలో జమ య్యాయి. అప్పటినుంచి డబ్బులు డ్రా చేసుకుందామంటే రాములమ్మకు తహ సీల్దార్ శ్రీనివాస్ రావు పొంతనలేని సమాధానం చెతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లుగా తనను కార్యాలయం చుట్టూ తిప్పుతూనే ఉన్నాడని, అయినా డబ్బులు డ్రా చేసుకోకుండా అడ్డుపడుతున్నాడని రాములమ్మ కన్నీరు మున్నీరైంది. తన కుటుంబ పరిస్థితి బాగాలేదని, ఇక చేసేదిలేక కూతురితో పాటు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపింది. ఇప్పటికైనా ఉన్న తాధికారులు తమకు న్యాయం చేయాలని రాములమ్మ వేడుకుంటోంది.