Monday, January 20, 2025

టీ20 వరల్డ్ కప్ 2024: తొలి మ్యాచ్ లో టీమిండియాకు షాక్

- Advertisement -
- Advertisement -

దుబాయి: మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ 58 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (27), ప్లిమ్మర్ (34) పరుగులు చేశారు. చివర్లో కెప్టెన్ సోఫీ డివైన్ 7 ఫోర్లతో అజేయంగా 57 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో రోజ్‌మేరీ నాలుగు, లియా తహుహు మూడు, ఎడెన్ కార్సన్ రెండు వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News