Sunday, January 19, 2025

వాటర్ బాటిల్ లో మూత్రం… ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయురాలు

- Advertisement -
- Advertisement -

భోపాల్: తాగే వాటర్ బాటిల్‌లో మూత్రం ఉందని ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నీముచ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. బాటిల్ తీసుకొని నీరు తాగడానికి ప్రయత్నించినప్పుడు మూత బిగుతుగా లేకపోవడంతో అలాగే వాటర్ తాగింది. నీళ్ల నుంచి వాసన రావడంతో ఆమె మూత్రం అని గ్రహించడంతో పాటు రుచి కూడా వేర్వేరుగా ఉండడంతో వెంటనే డిఇఒకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. డిఇఒ సికె శర్మ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఎంఎల్‌సి కవితకు సుప్రీంకోర్టులో ఊరట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News