పల్లెకెలె : శ్రీలంకతో గురువారం జరిగిన మూడో, చివరి వన్డేలో భారత మహిళా జట్టు 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్‌ను 30 తేడా తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇంతకుముందు భారత్ టి20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక చివరి వన్డేలో ముం దుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య శ్రీలంక 47.3 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైం ది. నీలాక్షి డిసిల్వా 48 (నాటౌట్), కెప్టెన్ ఆట పట్టు(44), హసిని పెరీరా (39) మాత్రమే రా ణించారు. మిగతావారు విఫలం కావడంతో లం కకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో రాజే శ్వర్ గైక్వాడ్ మూడు, మేఘనా సింగ్, పూజా వస్త్రకర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఆదుకున్న హర్మన్, పూజా
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీ మిండియా 255 పరుగులు సాధించింది. ఓపె నర్ స్మృతి మంధాన (6) ఆరంభంలోనే పెవిలి యన్ చేరింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ యస్తిక భాటియాతో కలిసి మరో ఓపెనర్ షఫాలి వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిం చింది. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 59 పరుగులు కూడా జోడించారు. అయితే ఐదు ఫోర్లతో 30 పరుగులు చేసిన యస్తికను రష్మీ వె నక్కి పంపింది.
ఆ వెంటనే షఫాలి కూడా వెను దిరిగింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫాలి ఐదు ఫోర్లతో 59 పరుగులు సాధించింది. తర్వాత వ చ్చిన హర్లిన్ డియాల్ (1), దీప్తి శర్మ (4), రిచా ఘోష్ (2) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో ఒక దశలో భారత్ 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పూజా వస్త్రకర్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు అద్భుత బ్యాటిం గ్‌తో జట్టుకు గౌరవప్రద స్కోరును అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ఏడు ఫోర్లు, రెం డు సిక్స్‌లతో 75 పరుగులు చేసింది. పూజా 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.