హైదరాబాద్: సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో మాత విగ్రహాలను, పలు ఆలయాలలో, చర్చిల్లో విగ్రహాలను ఇద్దరు మహిళలు ధ్వంసం చేశారు. ఇద్దరు అనుమానిత మహిళలను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పూజచేస్తున్న భక్తుడు వెంకటేష్ వారిని అడిగేలోపు ఒక రాడుతో దాడికి దిగి అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడినుండి పారిపోతున్న ఇద్దరిని అనసరిస్తుండగా అదే బస్తీలో ఉన్న చర్చిలో కూడ మరియా మాత విగ్రహం పై దాడి చేశారు. స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహిళలను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వెంకట్, సోయేల్ పై దాడి చేసి గాట్లు పడేలా కొరికారు. పోలీస్ విచారణలో వారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నిందితుల వద్ద నుంచి ఇనుప రాడ్డు, చిన్న చాకు, సరుపు పాకెట్, ఆయిల్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మవారి భక్తులు పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దర్యాప్తులో ఇరువురు మహిళలు మతిస్థిమితం లేని విధంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.
ఖైరతాబాద్ లో విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -