Friday, December 20, 2024

మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహి స్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కెసిఆర్ సర్కార్ అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వివరించారు. ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం అంటూ రాసుకొచ్చారు. సంక్షేమంలో సగం కాదు ఆమే అగ్రభాగం అని వివరించారు. అమ్మఒడి వాహనమైనా.. ఆరోగ్య లక్ష్మి పథకం అయినా ఇలా ఏదైనా మహిళల కోసమే అని స్పష్టం చేశారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెల్లకు అన్నలా, ఒంటరి మహిళలకు తండ్రిలా, ఆడబిడ్డలకు మేనమామలా, అవ్వలకు పెద్ద కొడుకులా, కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కల్యాణ లక్ష్మికేవలం పథకం కాదు ఒక విప్లవం అని వివరించారు. ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్ వేస్తూనే, మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పెట్టిందీ పథకం అని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అని పది లక్షలకు పైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సిఎం కెసిఆర్ అంటూ ప్రశంసించారు. గుక్కెడు మంచినీళ్ల కోసం.. మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న సిఎం కెసిఆర్ అంటూ చెప్పుకొచ్చారు. గర్భిణీలకిచ్చే న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగులు అని తెలిపారు. ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టేనని వివరించారు. కెసిఆర్ కిట్ తోపాటు అందే 13 వేలు, ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు అని అన్నారు.

లక్ష్మీ కటాక్షమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం కూడా అందేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని తెలిపారు. కార్పొరేట్ కు ధీటైన, గురుకులాలతో తల్లిదండ్రుల కలలు సాకారం చేసిన సర్కారు ఈ సర్కారు అంటూ స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన షీటీమ్ ఓ సంచలనం అని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విహబ్ అంతకు మించినదని వివరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఓ ప్రోత్సాహం అంటూ వెల్లడించారు. ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ ఓ గొప్ప సంప్రదాయం అంటూ మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News