Sunday, December 22, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. వికారాబాద్ జిల్లా మైల్వార్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన మహిళలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలు పార్లమెంట్ ఎన్నికలొచ్చినా ఎందుకు అమలుకావడం లేదంటూ ప్రశ్నించారు. గృహలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఏమయ్యాయని, రుణమాఫీ ఎందుకు చేయలేదని మహిళలు నిలదీశారు. స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News