Thursday, January 23, 2025

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం, తెలుగుతేజం నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన 50 కిలోల విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్లో నిఖత్ 50 తేడాతో మెక్సికోకు చెందిన ఫాతిమా అల్వరేజ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే నిఖత్ తన మార్క్ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ ధాటికి ఫాతిమా ఎదురు నిలువలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నిఖత్ సునాయాస విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నిఖత్ సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచ పోటీల్లో అసాధారణ ఆటతో అభిమానులను కనువిందు చేస్తోంది. మరోవైపు 48 కిలోల విభాగంలో నీతు గంగాస్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో తజకిస్థాన్‌కు చెందిన సుమయ్యాను నీతు చిత్తు చేసి ముందంజ వేసింది. కాగా, 57 కిలోల విభాగంలో మనీషా మౌన్, 60 కిలోల విభాగంలో జాస్మిన్ లంబోరియా విజయం సాధించారు. అయితే భారత్‌కు చెందిన శశి చోప్రా, మంజు బంబోరియాలు ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. కాగా, స్టార్ బాక్సర్లు లవ్లీనా బొర్గాయిన్, సాక్షి చౌదరరి, స్వాతి బురాలు ఇంతకుముందే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News