పేట్‌బషీరాబాద్: ఫిలిప్ అనాథ ఆశ్రమం పేరుతో డబ్బుల వసూళ్ళకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు అరెస్ట్ అయిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరులోని నవాబుపేటకు చెందిన చింతల ప్రతాప్ భాగ్యప్రధ(56), ఖుత్బుల్లాపూర్ చింతల్ పద్మానగర్ ఫేస్ 2లో స్థానికంగా నివసిస్తున్న గృహిణి, కాగా అదే ప్రాంతానికి చెందిన మరో మహిళ RTC కండక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న రెంటల మేరిహెలెన్(48)లు కలసి ఫిలిప్ ఆర్ఫనేజ్ ఫౌండేషన్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. డబ్బులు చెల్లించినవారు వారిని ఆశ్రమం ఎక్కడ అని నిలదీయడంతో స్థానికంగా ఏలాంటి ఆశ్రమం లేక పోవడం, డబ్బులు అమెరికా నుండి వస్తాయని బుకాయించడంతో తాము మోసపోయామని జరిగిన విషయాన్ని పేట్ బషీరాబాద్ పోలీస్‌లకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని మహిళలను రిమాండుకు తరలించారు. మోసంచేసి వసూలు చేసిన డబ్బులు దాదాపుగా రూ. 75 లక్షల వరకు ఉంటున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా మరోవ్యక్తి చింతల ప్రతాప్ కార్తీక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
womens Arrested for collecting money in name of an orphanage