Friday, December 27, 2024

మహిళల ఆసియా కప్: సెమీ ఫైనల్‌కు పాకిస్థాన్..

- Advertisement -
- Advertisement -

సిల్హేట్: మహిళల ఆసియాకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ అధికారికంగా సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ చమారి ఆటపట్టు, రణసింఘే, హసిని పెరేరా మాత్రమే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ధాటిగా ఆడిన ఆటపట్టు 26 బంతుల్లోనే 9 ఫోర్లతో 41 పరుగులు చేసింది. రణసింఘే 3 బౌండరీలతో 26 పరుగులు సాధించింది. పెరేరా రెండు ఫోర్లతో 18 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ బౌలర్లలో ఉమేమా సోహైల్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచింది. 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. తుబాకు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిదాదర్ 26 (నాటౌట్), ఆలియా రియాజ్ (20), ఆయేషా నసీం 16 (నాటౌట్) పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక సెమీస్‌లో శ్రీలంకతోనే పాకిస్థాన్ తలపడనుంది. మరో సెమీస్‌లో పసికూన థాయిలాండ్‌తో భారత్ పోటీ పడనుంది. గురువారం సెమీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Women’s Asia Cup: PAK Beat SL by 5 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News