Wednesday, January 22, 2025

ఎమ్మెల్సీ కవిత పోరుతో మహిళా బిల్లు సాకారం

- Advertisement -
- Advertisement -
సెర్ప్ ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో పాలాభిషేకం

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిందని సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జెఎసి నాయకులు భారతి, కుంట గంగాధర్‌రెడ్డి, ఏపూరి నర్సయ్య పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెర్ప్ ప్రధాన కార్యాలయంలో జెఎసి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి.. ధన్యవాదాలు తెలిపారు.

కవిత దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఎన్నోసార్లు మహిళా బిల్లు కోసం దీక్షలు చేపట్టారని వీటి ఫలితంగానే మహిళా బిల్లు పార్లమెంటులోకి రావడం జరిగిందన్నారు. కవిత పోరుతో రాష్ట్రంలో 40 మంది మహిళలు శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవితకు 50 లక్షల డ్వాక్రా మహిళల తరఫున జెఎసి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సుదర్శన్, మహేందర్‌రెడ్డి, వెంకట్ సురేఖ, విజయలక్ష్మి, ఖలీల్, యాదగిరి రాజారెడ్డి జానయ్యా, మధు, రాజప్ప పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News