Sunday, January 12, 2025

ఉమెన్స్ కాలేజీ విద్యార్థినులపై కుక్కల దాడి

- Advertisement -
- Advertisement -

కోఠిలోని ఉమెన్స్ కళాశాల (తెలంగాణ విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో కుక్క లు స్వైర విహారం చేస్తూ విద్యార్థినులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం కుక్కల దాడిలో ఇద్దరు డిగ్రీ విద్యార్థిని గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సలు పొందుతుంది. ఉమెన్స్ కాలేజీ లో బిఎస్సీ ద్వితీయ సంవత్సరం పుడ్ సైన్స్ విద్యనభ్యసిస్తున్న నిర్మల్ జిల్లాకు చెంది న వై అంకితతో పాటు మరో విద్యార్థినిపై కుక్కలు దాడి చేయడంతో ఒకరికి చెవికి, మరొకరికి కణత, నోటి వద్ద గాయాలయ్యాయి.

ఇది గమనించిన సహచర విద్యార్థినులు చికిత్సల నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించా రు. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారుల ఆదేశం మేరకు వెటర్నరీ సిబ్బంది ఉమెన్స్ కళాశాల ప్రాంగణంలోని తిరుగుతున్న రెండు కుక్కలను ప ట్టుకుని వెటర్నరీ సెంటర్‌కు తరలించారు. కళాశాల ప్రాంగణ ంలో 15 కుక్కలు సంచరిస్తున్నాయని, వాటిని మంగళవారం పట్టుకుని, వెటర్నరీ సెంటర్ కు తరలిస్తామని వెటర్నరీ అధికారులు పేర్కొన్నారు. కళాశాల పాలకవర్గం మెయిన్ గేటు నుండి కుక్కలు లోపలికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News