Wednesday, January 22, 2025

బిజెపి నేత బండి సంజయ్‌పై మహిళా కమిషన్ సీరియస్ !

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. శనివారం బండి సంజయ్‌ను మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ దాదాపు రెండున్నర గంటల పాటు సంజయ్‌ను విచారించింది. రాజకీయంగా, ఇంకేవిధంగా అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని మహిళా కమిషన్ చెప్పినట్లు సమాచారం. మహిళల పట్ల పలు సందర్భాల్లో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వీడియోల రూపంలో చూపించి నట్లు తెలిసింది. గతంలో బతుకమ్మను, మహిళలను లంగలు, దొంగలు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను కూడా చూయించినట్లు సమాచారం. భవిష్యత్తులో మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదంటూ ఆదేశించినట్లు తెలసింది.

ఎంఎల్‌సి కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బండి సంజయ్ రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తప్ప ఎలాంటి దురుద్దేశంతో చేయలేదని, ఈ వ్యాఖ్యలన్నింటిని ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ బండి సంజయ్ సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం మహిళలపై మరోసారి సామెతలను ప్రయోగించొద్దంటూ మహిళా కమిషన్ ఆదేశించినట్లు తెలిసింది. మరోసారి ఇలా మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎవరైనా మహళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. మహిళా కమిషన్ బండి సంజయ్‌ను మరోసారి విచారించే అవకాశం ఉందని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News