Monday, January 20, 2025

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో తమ మహిళా అభిమానులను వేడుక చేయడానికి, వారిని గౌరవించుకోవడానికి రెడ్ కార్పెట్‌ను పరిచి, చిరునవ్వుతో స్వాగతిస్తోంది. ఇందులో ఉత్తమ భాగం ఏమిటి ? ఇది ఒక రోజు మాత్రమే కాదు, నెల రోజుల వ్యవహారం గా నిలుస్తుంది! అవును, మీరు చదివింది నిజమే! ప్రత్యేకంగా నిర్వహించబడిన కార్యకలాపాలు, ఆఫర్‌లతో నిండిన నెలగా ఇది ఉంటుంది.

మార్చి 1-31 వరకు నైకా Luxe ద్వారా కాంప్లిమెంటరీ మేక్‌ఓవర్‌లు, స్కిన్ కన్సల్టేషన్ ను ఆస్వాదించండి. మీ కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దుకొండి, శీఘ్ర చిట్కాలను స్వీకరించండి, 15 నిమిషాల ఎక్స్‌ప్రెస్ మేక్ఓవర్ లేదా 30 నిమిషాల పూర్తి మేక్ఓవర్ లలో ఎదో ఒకటి ఎంచుకోండి. చర్మ సంరక్షణ నిపుణులు ఉచిత కన్సల్టేషన్ ను అందిస్తారు. వ్యక్తిగతీకరించిన చర్మ సంరక్షణ దినచర్యను రూపొందించడంలో సహాయపడతారు. మహిళలు సువాసన అనుభవంతో సరైన సువాసనను కూడా కనుగొనగలరు.

ఈ కార్యకలాపాలకు మరింత ఆహ్లాదం జోడిస్తూ, మాల్ లో మరింత వినోదం కోసం మార్చి 8న ఆకర్షణీయమైన ఫోటో బూత్‌ కూడా అందుబాటులో ఉంటుంది, ఇక్కడ మీరు తక్షణ డిజిటల్ ఫోటోల ద్వారా జ్ఞాపకాలను క్యాప్చర్ చేయవచ్చు! చివరగా, H&M, షాపర్స్ స్టాప్, టామీ హిల్‌ఫిగర్, కాల్విన్ క్లైన్, ఇతర ఆకర్షణీయమైన బ్రాండ్‌లలో కొత్త స్ప్రింగ్-సమ్మర్ కలెక్షన్‌ను షాపింగ్ చేయడం ద్వారా కొంత రిటైల్ థెరపీలో పాల్గొనడం మర్చిపోవద్దు.

మహిళా దినోత్సవ వేడుకతో పాటు, మాల్ కొత్త అంశాన్ని కూడా ప్రారంభిస్తోంది. #BeFitWithInorbit, అంటూ ఫిట్‌నెస్ సెషన్‌లను కూడా నిర్వహిస్తున్నది. 24 మార్చి 2024న సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ఉచిత జుంబా తరగతి షెడ్యూల్ చేయబడింది. ఈ మాల్, ఇటీవల, అంటే, ఫిబ్రవరి 28న NGO నిర్మాణ్‌తో భాగస్వామ్యమై విరాళాల డ్రైవ్‌ను నిర్వహించింది, అక్కడ మాల్ సందర్శకులు ముందుగా వినియోగించిన వస్త్రాలు, బొమ్మలను నిరుపేదలకు విరాళంగా అందించారు, దీని ద్వారా 500 మందికి పైగా ప్రయోజనం పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News