Monday, December 23, 2024

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద మహిళా దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అందమైన అమ్మాయిలూ, శద్ధ్రగా వినండి! ఈ మహిళా దినోత్సవ వేడుకలను నగరంలో అత్యంత ఉత్సాహపూరితమైన షాపింగ్‌ కేంద్రం ఇనార్బిట్‌ మాల్‌లో వైభవంగా నిర్వహించడానికి ప్రణాళిక చేశారు. వారం రోజుల పాటు జరిగే మాల్‌ యొక్క ఇన్‌ స్టైల్‌ కార్యక్రమంలో ఈ వేడుకలు భాగం.

మార్చి 8–12 వరకూ మహిళలు తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా ! ఇనార్బిట్‌ మాల్‌లోని మాల్‌ యొక్క సెంట్రల్‌ అట్రియం వద్ద షాపర్స్‌ స్టాప్‌, హెల్త్‌ అండ్‌ గ్లో , లైఫ్‌స్టైల్‌ మరియు కపిల్‌ సలోన్‌ ఏర్పాటుచేసిన పాపప్‌ బూత్‌ల వద్ద తమ మేకప్‌, మేకోవర్‌, హెయిర్‌ స్టైలింగ్‌ చేసుకోవచ్చు. ఈ సేవలు ప్రతి రోజూ ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి.

ఈ సేవలను పొందడం కోసం మహిళలు చేయాల్సిందల్లా, ఇన్‌ రివార్డ్‌ క్యుఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం లేదా 79980 79980 కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం చేయాలి. ఈ మాల్‌లో వినోదాత్మక ఫోటో బూత్‌ సైతం ఏర్పాటుచేశారు. ఇక్కడ మహిళలు ఈ ప్రత్యేక జ్ఞాపకాలను కలకాలం పదిలపరుచుకోవచ్చు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News