Wednesday, January 22, 2025

రాష్ట్రపతి నిలయంలో… సాహిత్య వేడుకలతో ముగిసిన మహిళా దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బొల్లారం రాష్ట్రపతి నిలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న వేడుకలు ఆదివారంతో ముగిసాయి. ముగింపు వేడుకల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం లిటరరీ ఫెస్ట్ ని నిర్వహించారు. ఈ సాహిత్య వేడుకలకి రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 200 పైచిలుకు కవయిత్రులు హాజరై ఎనిమిది భాషల్లో తమ కవితలను వినిపించారు. సంస్కృతంతో మొదలుపెట్టి ఉర్దూ వరకు దాదాపు 70- నుండి 80 మంది కవయిత్రులు పాల్గొంటే తెలుగులో 150 మంది వరకు పాల్గొన్నారు. ‘మహిళా అభ్యుదయం’ అంశంతో మూడు తరాల కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భావాల్ని కవితాత్మకంగా అందించారు. దాదాపు 10 ప్రక్రియలో ఈ పోయెట్రీ హారథాన్ సాగటం విశేషం. ఉదయం 10 గంటల నుండి నిర్విరామంగా సాగిన ఈ వివిధ భాషల కవిసమ్మేళనం నిరాఘతంగా సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మహిళ ఆకాశంలో అవానిలా సగం మాత్రమే కాదు మొత్తంగా విశ్వవర్ణం ఆమెదే అంటూ రచయిత్రులు ముక్త కంఠంతో వినిపించారు.

మహిళా సాధికారత, రిజర్వేషన్లు , ఆర్థిక స్వావలంబన, సమ భాగస్వామ్యం మీద ఎక్కువగా కవితలు రాయడం విశేషం. ఈ నెల 6న మొదలైన హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫట్స్ ఎక్సిబిషన్ మార్చ్ 10వ తేదీ వరకు కొనసాగింది. కళాకారులందరూ తమ సృజనాత్మకతను జోడించి చేసిన సాంప్రదాయ హస్తకళలు, చేనేతలు ఎందరి మనసుల్లోనో చూరగొన్నాయి. మొత్తంగా 05 రోజుల పాటు జరిగిన హ్యాండ్లూమ్ ఎక్సిబిషన్, 3 రోజుల పాటు సాగిన సాహిత్య సంబరాలు మహిళల మనసుల్ని దోచుకుని రాష్ట్రపతి నిలయానికి అదనపు ఆకర్షణను అందించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ధన్యవాదాలు చెప్తూ మహిళలందరూ శుభకాంక్షలు అందించారు. ప్రతి వారాంతంలో సాయంత్రం సందర్శన వేళలను 7 గంటల వరకు పొడిగించినట్లు రాష్ట్రపతి నిలయ అధికారి డా.రజని ప్రియ తెలిపారు.

Women's Day 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News