- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల సమస్యలపై ఓయూ అధ్యాపక బృందం మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మానవ ఆరోగ్యం, లింగ సమానత్వం, పిల్లల సంరక్షణ, ఉద్యోగులకు సెలవులు, పర్యావరణపై మహిళల ప్రభావం అనే అంశంపై పలు వక్తలు ప్రసంగించారు.
భవిష్యత్తులో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళ ప్రొఫెసర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ యాదవ్, ఓఎస్డీ రెడ్యానాయక్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ రేఖా పాండే, విమెన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ సయ్యదా అజీమ్ ఉన్నీసా, అంబేద్కర్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. మంగు, జ్యోతిబా ఫూలే సెంటర్ డైరెక్టర్ డాక్టర్ చల్లమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
- Advertisement -