Monday, December 23, 2024

రేపు రవీంద్రభారతిలో మహిళా ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి

Womens day celebrations in Ravindra bharathi
మనతెలంగాణ/ హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ శుక్రవారం రవీంద్రభారతిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ప్రత్యేక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ హాజరౌతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళ రక్షణ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ ఈ సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు సబితారెడ్డి, సత్యవతిరాథోడ్, వి-హబ్ సీఈవో రావుల దీప్తి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య హాజరౌతున్నారని తెలిపారు. సమావేశంలో కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీభాయి, కొమ్ము ఉమాదేవియాదవ్ , గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతిరావు పాల్గొన్నారు.

 

Womens day celebrations in Ravindra bharathi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News