Saturday, December 21, 2024

తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మహిళాదినోత్సవం

- Advertisement -
- Advertisement -

* మహిళదినోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికిన మహిళలు

నల్లగొండ : నిడమనూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్థి ఉత్సవాల్లో భాగంగామహిళ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో మంగళవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు బతుకమ్మలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, అడిషినల్ కలెక్టర్ కూష్భూ గుప్తా ముఖ్య అతిథిలుగా మహిళాదినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మహిళల ఎదుగుదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన తెలిపారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించారు. డ్వాక్రా మహిళలకు 22.24 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కును మహిళా సంఘాలకు ఎమ్మెల్యే నోముల భగత్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశం, ఎంపీపీ బొల్లం జయమ్మ, మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌లు, వెంపటి పార్వతమ్మ, శంకరయ్య, పాక్స్ చైర్మన్ జయరాం నాయక్, కర్ణ అనూష శరత్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ పీడిపీ ఆర్డీఏ ఎడి రాజకుమార్, కాలిందినే, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, నియోజకవర్గ అధికారి పద్మావతి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, ఎంఆర్‌ఓ ప్రమీల, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, వైస్ ఎంపీపీ మాలే అరుణ, మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, ఎంపీటీసీలు ఉర్లగొండ వెంకటయ్య, పెద్దమాము యాదయ్య,  వివిధ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ అనుబంధ సంఘాల మహిళా అధ్యక్షురాలు, ముఖ్య నాయకులు మరియు సూపర్వైజర్లు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News