Friday, December 20, 2024

చీర కోసం షాపింగ్ మాల్‌లో మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మైసూర్ వార్షిక చీరల విక్రయం వద్ద చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఓ షాపింగ్ మాల్ లో మైసూర్ సిల్క్ చీర వార్షిక విక్రయం నిర్వహించారు. దీంతో చీరలు కొనడానికి షాపింగ్ మాల్‌కు భారీగా కస్టమర్స్‌ వచ్చారు. అయితే, ఇద్దరు మహిళలు ఒక చీర కోసం గొడవపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

వారు ఒకరి జుట్టు మరొకరు లాగుతూ కొట్టుకుంటుండడంతో అంతా షాకయ్యారు. అక్కడున్న వారు ఇద్దరు మహళలను అడ్డుకోవడంతో గొడువ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేయగా, మరికొందరు.. ఇదంతా, వారి షాపులో చీరలకు ఎంత డిమాండ్ వుందో చెప్పేందుకే ఈ వీడియోను వారు ప్రకటనగా ఉపయోగించుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News