Thursday, January 23, 2025

విమెన్స్ ఐపిఎల్ విజేతకు రూ.ఆరు కోట్లు!

- Advertisement -
- Advertisement -

ముంబై: త్వరలో జరిగే మహిళల తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం భారత క్రికెట్ బోర్డు కసరత్తును ముమ్మరం చేసింది. టోర్నీకి సంబంధించిన పలు విషయాలపై గురువారం ముంబైలో జరిపిన బోర్డు సమావేశంలో చర్చించినట్టు సమాచారం. పురుషుల ఐపిఎల్ మాదిరిగానే ఈ ఏడాది నుంచి మహిళలకు కూడా టి20 టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పోటీ పడనున్నాయి.

తొలి సీజన్‌లో 22 మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఇక విజేత టీమ్‌కు ఆరు కోట్ల రూపాయల నగదు బహుమతిగా అందించనున్నారు. రన్నరప్‌కు మూడు కోట్లు, మూడో స్థానంలో నిలిచే టీమ్‌కు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. ఇక ప్రతి టీమ్‌లో ఐదుగురు విదేశీ క్రికెటర్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News