న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో ట్వంటీ20 లీగ్‌ను నిర్వహిస్తే బాగుంటుందని టీమిండియా మహిళా టి20 సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మహిళల కోసం బిగ్‌బాష్ లీగ్ నిర్వహిస్తుందన్నాడు. భారత క్రికెట్ బోర్డు కూడా ఐపిఎల్ మాదిరిగానే మహిళల కోసం కూడా ఇలాంటి లీగ్ నిర్వహించాలని కోరింది. ఇది మహిళా క్రికెట్‌కు ఎంతో మేలు చూస్తుందని తెలిపింది. ఐపిఎల్ వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన విషయాన్ని హర్మన్ గుర్తు చేసింది. మహిళలకు కూడా ఇలాంటి లీగ్ నిర్వహిస్తే ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు అందుబాటులో రావడం ఖాయమని జోస్యం చెప్పింది. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనేగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హర్మన్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా ఎంపికై చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన హర్మన్ 399 పరుగులు, మరో 15 వికెట్లు పడగొట్టింది.